తెలంగాణలో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

  • మల్కాపూర్ లో ‘కంటి వెలుగు’ ప్రారంభం
  • స్వయంగా కళ్లద్దాలు అందజేసిన కేసీఆర్
  • కంటి పరీక్షల శిబిరాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి
తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ పథకాన్ని సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ లో ‘కంటి వెలుగు’ను ఆయన ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న ఓ మహిళకు కేసీఆర్ స్వయంగా కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా కంటి పరీక్షల శిబిరాన్ని పరిశీలించారు. కంటి పరీక్షల గురించి వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అంతకుముందు ఫొటో ప్రదర్శనను కేసీఆర్ తిలకించారు. కాగా, దృష్టి లోపంతో బాధపడుతున్న వివిధ వయసులకు చెందిన తెలంగాణ ప్రజలకు ‘కంటి వెలుగు’ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించడం, కళ్ల అద్దాలు అందజేయడం, అవసరమైతే కంటి శస్త్ర చికిత్సలు, మందులను ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఉచితంగా అందజేయనుంది. 
Go Back to Shorts
Telangana
kcr
kanthi velugu

More Telugu News